అనువాదం: ధూళిపాళ అన్నపూర్ణ
మూల రచయిత: విశాఖదత్త (సంస్కృత నాటకం)
విభాగం: తెలుగు నాటక పుస్తకాలు
భారతీయ సంస్కృత సాహిత్యంలో అమరకీర్తి సాధించిన విశాఖదత్త రచించిన ప్రసిద్ధ సంస్కృత నాటకం ముద్రారాక్షసమ్ ను ధూళిపాళ అన్నపూర్ణ తెలుగులో అనువదించిన అపూర్వమైన రచన ఇది.
చంద్రగుప్త మౌర్య సామ్రాజ్య నేపథ్యంలో జరిగే ఈ నాటకం — చాణక్యుని రాజకీయ చాణక్యం, రాక్షసుని వ్యూహాత్మక బుద్ధి, ముద్ర రహస్యం చుట్టూ నిర్మించబడిన కథనం పాఠకుని చివరకూ వదలకుండా చదివిస్తుంది. రాజకీయ తంత్రాలు, వ్యక్తిత్వ సంఘర్షణలు, మిత్రద్రోహాలు — ఇవన్నీ ఈ నాటకంలో జీవంతంగా చిత్రించబడ్డాయి.
భారతీయ చరిత్ర మరియు సంస్కృత సాహిత్యాభిమానులకు ఇది ఒక అమూల్యమైన కానుక.