Vamsy ki Nachchina Kathalu - 2 | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Vamsy ki Nachchina Kathalu - 2

52 కధల వంశీకి నచ్చిన కధల సంపుటి. ఇది రెండవ భాగం - ప్రతి కథ తప్పక ఆకట్టుకుని తీరుతుంది.

                  ఎన్నో ఏళ్ళ నుంచి తమను స్వయంగా పరిచయం చేసుకొని నా హృదయం మీద ముద్రలు వేసినవి. వీటికి ఎవరి సిఫార్సులు, యోగ్యతా పత్రాలు లేవు. ఇలా పేరును బట్టిగాక తీరును బట్టి కథను కథగా గుర్తుపెట్టుకుని ఎంపిక చేసిన కధలు అరుదని నా అభిప్రాయం. నాకు నచ్చి నేను పదిలపర్చుకొన్న ఈ వైవిద్యభరితమైన కథలు సహృదయ పాటకలోకానికి నచ్చుతాయని ఆశిస్తున్నాను.

                 ఆల్రెడీ ఎన్నో కధల సంపుటులు వుండగా, మరెన్నో వస్తుండగా ఈ కథా సంకలనాన్ని తీసుకురావడానికి కారణం నా అభిరుచి, అనుభూతులు నావి కావడమే! అనడమేగాకుండా చాలామంది రచయితలు వాళ్ళకి నచ్చిన కధలు సంకలనాలు తేవడం చాలా న్యాయమని చిన వీరభద్రుడు గారన్న మాటకి ఏకీభవిస్తున్నాను.

                         ఈ సంకలనంలో వున్న కధలు కూడా కొన్ని ఇతర సంకలనాల్లో వచ్చి ఉండవొచ్చు. అవి అరుదు. రాకూడదనే నియమమేమీ పెట్టుకోలేదు. ఒకమాటలో చెపితే, నా పరిధిలో నేను మెచ్చిన, నాకు నచ్చిన కధలు తప్ప పేరున్న రచయితలవని కాని, నోరున్న కథలని కాని ఈ ఎంపికలో చూడలేదు. ఇలా ఈ కధలు ఎప్పటికైనా ఏ బాషలోనైనా ఎల్లలు లేనివి. ఎప్పటికీ ఆస్వాదించతగ్గవి. నన్ను ఏళ్ళ తరబడి వెంటాడుతుండేవి. చదివి మర్చిపోలేనివి. అందుకే వీటన్నింటినీ తలకెత్తుకుంటూ, నాకెందుకు అంతగా నచ్చాయో ప్రతి కథ చివరా అయిదారు వాక్యాల్లో చెప్పడానికి ప్రయత్నం చేసాను.  

You may also be interested in

Liquid error (templates/product line 147): Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out