Suresh Veluguri
Larger than life - Nallamala VaaliMaama
అతనొక చెంచు గిరిజన వీరుడు. నల్లమల అరణ్యంలో ఒక తట్టుకు పరిధుల్లేని మొనగాడు. అడవిని, ప్రకృతిని కాపాడుకోవడంలో ఎన్నడూ దేనికీ వెరవనివాడు. కల్దారి భారీవంతెనను దాదాపు అర్థ శతాబ్దం పాటు తన సొంతమన్నట్లుగా కాపాడుకున్నవాడు. గిరిజనుల హక్కుల సాధనకు ఉద్యమించినవాడు. అడవినీ, ప్రకృతి సూత్రాలనీ అందరికీ విడమర్చిచెప్పినవాడు. అడవుల్లేకపోతే తరతరాలూ ఎలా నష్టపోతాయో వివరిస్తూ, అడవుల్ని బతికించుకోవల్సిన అవసరాల్నిఅనుభవపూర్వకంగా చెప్పినవాడు. అడవంటే ఒక ఆలోచన. ఆ ఆలోచనలో వాలిమామ ఎప్పటికీ జీవించేవుంటాడు.
"నల్లమల వాలిమామ" ఒక కల్పిత పాత్రే అయివుండొచ్చు. కానీ, కొన్ని తరాలపాటు ప్రతి మనిషీ ఆరోగ్యకరంగా జీవించడానికి వేయాల్సిన దారులను చూపించినవాడు. ఇప్పుడు నడుస్తున్న వాతావరణ పరిస్థితుల్ని వ్యతిరేకిస్తూ, మనం మార్చుకోవాల్సిన పద్ధతుల్ని తెలిపిసవాడు. వాలిమామతో కలిసి నడవడమంటే ... వందేళ్లపాటు మనం ఆరోగ్యంగా జీవించడం. ఈ సత్యాన్ని గుర్తించినవారంతా వాలిమామను అనుసరిస్తారు. నమ్మనివారు జీవితంలో ఎంతో కోల్పోతారు. ఎవరు అవునన్నా, కాదన్నా ఇది సత్యం. సత్యమే జయం.
ఎన్నో తరాలపాటు గుర్తుండిపోయే వాస్తవ ఘటనలకు రూపం వాలిమామ. ప్రకృతినీ, పర్యావరణాన్నీ కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరి చేయూత అవసరమని నినదిస్తున్న వాలిమామను, ఆయన కార్యాచరణనీ మనమందరం తప్పనిసరిగా అనుసరించాలి, మున్ముందుకు తీసుకువెళ్లాలి. ఇది ప్రతిఒక్కరి నైతిక బాధ్యత.
"నల్లమల వాలిమామ ప్రపంచం" పేరుతో విడుదలైన ఒక అంతర్జాతీయ స్థాయి పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. వాలిమామ ఇందులో ప్రధానపాత్రగా కనిపిస్తాడు. ఆయన జీవన ప్రయాణాన్ని ఒక క్రానలాజికల్ ఆర్డర్‌లో పెడుతూ మొత్తం 117 కథలు, 130కి పైగా అద్భుతమైన ఇలస్ట్రేషన్లు; నల్లమల అడవి అందాల ఫొటోలతో ముస్తాబైన ప్రకృతి బాలశిక్ష ఈ పుస్తకం. ప్రతి ఇంటా వుండితీరాల్సిన 5 పుస్తకాల సిరీస్ ఇది. ఈ వెయ్యి పేజీల ఐదు వాల్యూమ్స్ ఇంట్లో వుంటే వయసులతో సంబంధం లేకుండా అన్ని వయసులవారూ చదువుతారు. వాలిమామ చెప్పిన ప్రకృతి ఆలోచనల్ని మనసులో నింపుకుంటారు. వాటిని ఆచరించే కృషిని ప్రారంభిస్తారు.
రండి, నల్లమల వాలిమామ సిరీస్‌ను మీ సొంతం చేసుకోండి.