Puttaparthi Nagapadmini,పుట్టపర్తి నాగపద్మిని
యావదాంధ్రజాతికి గర్వకారణమైన సాహిత్యరత్నం 'సరస్వతీపుత్ర'శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు .ఆ రత్నాన్ని పొదివి పట్టుకొని,ఆ కాంతిని మరింత ఇనుమడింపచేసిన సార్థకనామధేయ ,పదారు వెన్నెల కనకాహారం శ్రీమతి పుట్టపర్తి కనకమ్మ గారు.వారిలో అక్షరాలా సగభాగం,వారి అక్షరాలా భారం పూర్తిగా మోసి రాసిన వారి అర్ధాంగి లక్ష్మి ,సరస్వతీపుత్రి శ్రీమతి కనకమ్మ గారు .