‘ఝోలి – గోర్ బంజారా సాకి ’ డా. సూర్య ధనంజయ్ రచించిన బంజారా కథల సంకలనం. బంజారాల భాష, యాస, బతుకు, వారి జీవితాల్లోని వెలుగునీడలను ఈ కథలు ప్రతిబింబిస్తాయి. బంజారా సమాజాన్ని, జీవనరీతులను దగ్గరగా చూసిన అనుభవంతో రచయిత్రి ఈ కథలకు జీవం పోశారు.
బంజారాల కష్టసుఖాలు, పేదరికం, ఆచారవ్యవహారాలతోపాటు మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో విస్తృతమవుతున్న సాంస్కృతిక దూరాలను ఈ కథలు స్పృశిస్తాయి. తాను ఎదిగివచ్చిన మట్టికి సాహిత్య గౌరవాన్ని అందిస్తూ, బంజారా బతుకు చిత్రాలను పాఠకుల ముందుంచే కథాసంపుటి ఇది.