చారిత్రక నవలా చక్రవర్తి ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారు జననం 23 డిసెంబర్ 1940, నిర్యాణం 8 అక్టోబర్ 2026
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులు. ఎనభైకి పైగా రచనలు, ఇరవైకి పైగా చారిత్రక నవలలు. శాతవాహనుల యుగమైనా, కాకతీయుల యుగమైనా, తెలుగు నేల గతాన్ని పాత్రలుగా, సంఘర్షణలుగా మన కళ్ళ ముందు నిలిపారు.
శ్రావణి, శ్రీలేఖ, ఆవాహన, చంద్రకళ, వసంత గౌతమి, నాగానీక, ఆషాఢ గౌతమి, రెసిడెన్సీ, మాలిక్ కాఫర్ నవలలను నవోదయ ప్రచురణలుగా పాఠకులకు అందించే అవకాశం మాకు దక్కడం మా భాగ్యం.
ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారికి మనం అర్పించగల అసలైన నివాళి ఆయన పుస్తకాలు చదవడమే.