Gana Velpula
“ప్రేమ లో – కండరాళ్లు ముక్కలవుతాయి,కష్టాలు కథలవుతాయి,కన్నీళ్లు పాటలవుతాయి,కోపాలు ఉద్యమాలవుతాయి,కాలి చెప్పులు చెంప దెబ్బలవుతాయి.ప్రేమించడం అబద్ధం,ప్రేమించబడడం అబద్ధం,కాని ‘ప్రేమ’ నిజం శాశ్వతం".ప్రేమ అంతు చూద్దాం అని ఈ పుస్తకం రాయడం మొదలు పెట్టాను కానీ,ప్రేమే నా తాట తీసింది. నాకు మళ్ళీ ప్రేమించడం నేర్పించింది.సంధ్యా, వెన్నెల, సమయా తో రాసిన ప్రేమ కథలు మీతో చాలా కాలం ఉండిపోతాయి.మనల్ని ఉత్సాహపరచి, ఉద్రేకంలో ముంచి, ఉత్తేజంతో పరుగులు పెట్టించే ప్రేమ అవసరం లేదు.ఎప్పుడూ విడిచిపెట్టని ప్రేమ కావాలి అనే నిజం మిమ్మల్ని మళ్ళీ కొత్తగా ప్రేమించేలా చేస్తుంది అని కోరుకుంటూ ఇది పుస్తకం కాదు ప్రేమ కి నా పరిహారం. - రచయిత గణ