Gudipati Kondandapathi,Unnam Jyothivasu
మనిషి అందాన్ని ఆరాధిస్తాడు.సృష్టిలో ప్రతిదీ అందమైనదే.ఆ అందం కవిత్వాన్ని ఆకర్షిస్తుంది.కవిత్వం అందాన్ని ఆకర్షిస్తుంది.చివరకు అందమే కవిత్వమవుతుంది.ఆ అందాన్ని అందంగా వ్యాఖ్యానిస్తుంది భానుమిశ్రుని రసమంజరి.అది స్త్రీ స్వభావతత్వాన్ని , మృదుత్వాన్ని,వృత్తులనూ,అవస్థలనూ లావణ్యంగా చిత్రించింది. రసమంజరిని చాలా మంది అనువదించారు కానీ అవేవీ గణనకెక్కలేదు. గుడిపాటి కోదండపతి అనువాదం మాత్రం మూలం కంటే అందంగా తెలుగులో ఒదిగిపోయిందని శతావధాని వేలూరి శివరామశాస్త్రి వంటి దిగ్దంతులు మెచ్చుకున్నారు.భానుమిశ్రుడు చెప్పని దశమనాయికను కూడా కోదండపతి ప్రదర్శించాడు.ఇది ఈగ్రంథ గుణగరిష్ఠతకు మూలం.అతని కవిత్వం మృదుల శృంగార సౌరభాలను విరజిమ్మే ఉత్పలం