Sangisetty Srinivas,Gudipalli Niranjan,సంగిశెట్టి శ్రీనివాస్ ,గుడిపల్లి నిరంజన్
దళితులపై దాడులు దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిత్యేకృత్యమైన ప్రస్తుత పరిస్థితుల్లో చైతన్యంతో ప్రశ్నించాల్సిన సందర్భమిది .ఈ చైతన్యాన్ని ఎక్కువగా ప్రోది చేసేది సాహిత్యమే .అందులో కథ సాహిత్యం ముందువరుసలో ఉంటుంది .ఇట్లా తెలంగాణాలో పుట్టి ఇక్కడి ఆత్మను ,ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకున్న దళిత కథకులు రాసిన కథలను ఇందులో ఒక్క దగ్గరికి తీసుకొచ్చినాము .ఖైతునకల దండెలోని దారంలా తెలంగాణ దళిత సమాజం జీవితాలు,చరిత్ర క్రమంలో అవి మారుతూ ,ఎదుగుతూ వచ్చిన తీరును ఈ కథలు చిత్రి కించాయి .