Addanki Srinivas
విష్ణు నారాయణ కృష్ణో అంటూ అమర నిఘంటువు .అమరసింహుడు బౌద్ధుడైన విష్ణువునకు నారాయణుడికి కృష్ణుడికి బేధం చెప్పలేదు .నారాయణుడే కృష్ణుడు.విష్ణువే కృష్ణుడు అని సమస్త పురాణాలూ చెప్పిన విషయాన్నే స్వీకరించి అమరకవి.విష్ణునామాలలో కృష్ణమాన్ని చేర్చాడు .అంతేకాదు,ప్రద్యుమ్నో మీనాకేతన అని రుక్మిణి పుత్రుడైన ప్రద్యుమ్నుడికి లక్ష్మీపుత్రుడైన మన్మథుణ్ణి పర్యాయపదం వాచీగా చేశాడు .అటువంటి శ్రీకృష్ణ కథను అవతార విశేషాలను భాగవతం ఆధారంగా చెప్పాలన్నదే ఈ ప్రయత్నం .