Rao Krishnarao,రావు కృష్ణారావు
సోవియట్ విప్లవం తర్వాత యూరోప్ లో విప్లవాలు వస్తాయని ఆశించిన మార్కిస్టు మేధావులకు నిరాశ మిగిలింది .పైగా ఫాసిజం వచ్చింది.వారు అలోచించి కొన్ని అభిప్రాయాలను వెల్లడించారు .కమ్యూనిస్టులు తమ చూపునంతా ఆర్థిక,రాజకీయ రంగాలపైనా నిలిపారని,సాంస్కృతిక,ముఖ్యంగా భావజాల రంగాలను విస్మరించారని చెప్పారు .అదే సమయంలో పెట్టుబడిదారీ వ్యవస్థ చాలా బలమైన సాంస్కృతిక వ్యవస్థను సృష్టించిందని కూడా చెప్పారు .ప్రపంచ పెట్టుబడి కేవలం సైనిక శక్తీ ద్వారా మాత్రమే కాక ,ముఖ్యనగ ప్రజల మెదళ్లను అదుపు చేయడం ద్వారా పాలిస్తున్నదని పలువురు మేధావులు చెపుతున్నారు.సోవియట్ పతనంలో సంస్కృతి పాత్ర చాలా ప్రధానమైనదని పలువూరి వాదన .ఇటువంటి సమయంలో మరి ముఖ్యంగా ఫాసిజం ప్రమాదం పొంచివున్న తరుణంలో ఈ విషయం గురించి అందరు ఆలోచించాల్సి వుంది.
ఈ సందర్బంగా ఈ రంగంలో అత్యంత ప్రముఖులు అతి ముఖ్య సమస్యలను అతి క్లుప్తంగా పరిచయం చేసే ప్రయత్నమే ఈ పుస్తకం .