Feelings of a Gentleman
స్త్రీ, పురుష అనుబంధ, బాంధవ్యాల గురించి వచ్చిన ఒక మంచి పుస్తకం ‘మధుపం: ఒక మగవాడి ఫీలింగ్స్’. నేను అచ్చంగా పదహారణాల తెలుగింటి మగవాడిని అని రచయిత పూడూరి రాజిరెడ్డి వినయంగా చెబుతూనే అతిశయంగా రాసుకున్న కొన్ని అనుభూతుల సమాహారం ఇది. స్త్రీ, పురుష సంబంధాలు బలంగానో, క్లిష్టంగానో పైకి కనిపిస్తున్నా వాటి వెనుక ఇంత సున్నితత్వం, భావుకత్వం, ఇంత రసవంతమైన ఫీలింగ్స్ ఉంటాయని, మళ్లీ మనకు గుర్తు చేస్తూ వాటి గురించి మనసు విప్పి మాట్లాడిన ఈ పుస్తకం అబ్బురపరుస్తుంది.