Mulk Raj Anand,Avasaraala Suryarao,ముల్క్ రాజ్ ఆనంద్ ,అవసరాల సూర్యారావు
ఈ నవలలో ప్రధానపాత్ర 'మునూ' అనే ఒక కూలీ .నిరుపేద రైతుకుటుంబంలో పుట్టి,వున్నా ఆ కాస్తభూమి భూస్వామి ఏనాడో అపహరించగా తాను పుట్టింగడ్డ ఒదిలి పొట్ట చేత్తో పట్టుకొని ,పట్టెడన్నంకోసం పడరాని పాట్లు పడుతూ ఒక ఇంటి నౌకరుగా ,ఫ్యాక్టరీ కార్మికునిగా ,చివరకు రిక్షాకూలీగా అనేక కష్టాలకు లోనయిన 'మునూ' దుఃఖమయ జీవిత విముక్తికై ,సుసంఘటిత పోరాటమే మార్గమని ఈ నవలలో ప్రతిపాదింపబడింది .కథ నిర్వహణలో,మనస్తత్వ నిరూపణలో పాత్రలను మలచడంలో శ్రీ ముల్కరాజ్ ఆనంద్ సిద్ధహస్తుడు .