Out of Stock
Gunturu Seshendra Sarma,గుంటూరు శేషేంద్ర శర్మ
కామోత్సవ్ నవల 1987 లో ఆంధ్ర జ్యోతి లో ధారావాహికంగా వస్తున్నప్పుడే సంచలనం సృష్టించింది . శేషేంద్రను అరెస్ట్ చేయాలని కోరుతూ కోర్టులో క్రిమినల్ కేసు వేశారు. హై కోర్టు సుప్రీమ్ కోర్టు దాకా పోయింది. అన్ని కోర్టులలో న్యాయమూర్తులు కేసు కొట్టేశారు " ఇది నవల రూపంలో ఉన్న ఒక రజాకార్ పుంశ్చలిక నేర గాథ , జీవిత చరిత్ర , అంతరాత్మ కథ అంటున్నారు శేషేంద్ర కుమారుడు సాత్యకి . 2006 లో మరొకరితో రాయించి అచ్ఛు వేయించారట . కనుకనే ఆంద్ర జ్యోతిలో వచ్చ్చిన శేషేంద్ర మూల రచనను తొలి ముద్రణ వెలుగులోకి తెస్తున్నారు సాత్యకి.
“నవల పాఠకుడి ద్వితీయ జీవితం భయంకర పాప పుణ్యాల బంధం నుంచి విముక్తి పొందిన అనుభూతి.... నవల ఒక మారిజువానా; ఒక కొకెయిన్ పొగ మేఘాలు నిండిన మేఘాల లోయ... నవల పాఠకుల చేత ఆజరామరత్వం అనుభవింపచేస్తుంది. పుస్తకాన్ని రచయిత రాయడు, పుస్తకం రచయితచేత రాయిస్తుంది...”
శేషేంద్ర