Out of Stock
Sai Papineni,సాయి పాపినేని
జాతి ఉనికి ఆ జాతి ఉమ్మడితనం ఫై ఆహారపడి ఉంటుంది.అంటే అవగాహనలో ఆలోచనల్లో ,ఆచరణలో,ఆశయాల్లో,ఆకాంక్షల్లో ఏకత్వం .విడివిడి భావజాలాలు కలివిడి లేని అస్తిత్వాల రణగొణధ్వనుల మధ్య మనం ఒకటే అని చెప్పేందుకు ఆధారాలు ఒక్కటొక్కటిగా మాయమవుతున్నాయి.బాషా యాసలుగా విడిపోయింది దేశం రాష్ట్రాలుగా,ప్రాంతాలుగా విడిపోయింది,ప్రజలు కులాలుగా ,వర్గాలుగా మేధావులు వివిధ భావజాలాలు మోసే కూలీలుగా విడిపోయారు.
మన ఉనికిని కాపాడుకోవాలంటే మనకి మనమెవరో తెలియాలి.మూలలలో మానని మనం వెతుక్కోవాలి .జాతి మూలలను తెలియజెప్పేది చరిత్ర ,చరిత్ర తెలియాలంటే,మనలో చరిత్ర పట్ల ఆసక్తి ఉండాలి.మంచి చరిత్ర కథలే మనలో మరింత తెలుసుకోవాలనే కోరిక కలిగిస్తాయి .తెలుగు సాహిత్యంలో ,పక్క భాషలతో పోలిస్తే .వాసాత్విక చారిత్రక రచనలు చాలా కొద్దీ.ఉన్న కొన్ని డెబ్బయ్యేళ్ళ కిందట ఆంధ్రరాష్ట్రోద్యమం నేపథ్యంలో వచ్చినవే.ఆ తరువాత కాలంలో వచ్చినవి దాదాపు శూన్యం .ఆ లోటు పూరించే సాధనమే .
నేటి రచయితల కథలతో పాఠకులను చరిత్రలోకి నడిపించే ప్రయత్నం .