Out of Stock
Author:Swarna
13 వ శతాబ్దపు మంగోల్ ప్రాంతం ఒక అనాగరిక గ్రామీణ మైదాన ప్రాంతం .ఎన్నో తండాలు మా పశువులు
పెంచుకుంటూ పశుగ్రాసం కరువైనప్పుడు తండాలుగా ప్రయాణించి మరో పచ్చికబయల్లను ఆక్రమించేవి .
ఆ సమయంలో తండాలమధ్య దాడులు ,ప్రతిదాడులు జరిగేవి .అందులో ఎందఱో మరణించారు .అలాంటి
ఒక చిన్న తండా నాయకుడి కుమారుడిగా 'టెముజిన్' పేరుతో జన్మించి తన గ్రామీణ జీవన విధానం
నిశితంగా పరిశీలించి 12వ ఏట తండ్రి మరణించగా అతడి వారసత్వం స్వీకరించి నయానో భయానో
వివిధ మంగోల్ తండాలను ఏకం చేసి మంగోల్తండాల ఏకైక నాయకుడై ఖాన్లకు ఖాన్ గా "చెంగిజ్ ఖాన్ "
బిరుదు వహించి తన ఇరుగు పొరుగు ఆరిక దేశాల వైపు దృష్టి సారించాడు.50 ఏళ్ళ సుదీర్ఘ పోరాటాలతో
జగజ్జేతగా నిలిచాడు .