Pulicherla Subbarao,పులిచెర్ల సుబ్బారావు
కర్ణాటకయుద్ధాలు ,బొబ్బిలియుద్ధము ,మూడవ పానిపట్టు యుద్ధము ,ప్లాసీ యుద్ధము ,బాక్సర్ యుద్ధము -ఈ కాలఖండంలో జరిగినవే .ఈ నవల కార్యరంగంగా తెలుగునాడునే తీసికొన్న కారణంగా మూడవ పానిపట్టు యుద్ధము ,ప్లాసియుద్ధము ,బాక్సర్ యుద్ధము విపులంగా చెప్పబడకపోయిన ,దక్షిణాదిన సంభవించిన యుద్ధాలన్నీ విపులంగా చెప్పబడటమేగాక అవిస్మరణీయమైన బొబ్బిలియుద్ధం గుండెలను పిండివేసేతీరులో చెప్పబడటం ఈ గ్రంథంలోని ఒక ప్రత్యేకత .