తెలుగు పెద్ద కథలు — మహమ్మద్ ఖదీర్ బాబు సంపాదకత్వం
తెలుగు కథా సాహిత్యంలో నిలచిపోయిన గొప్ప రచనలను ఒకే చోట అందించే అపూర్వమైన సంకలనం ఈ తెలుగు పెద్ద కథలు. మహమ్మద్ ఖదీర్ బాబు సంపాదకత్వంలో తెలుగు సాహిత్యంలోని వివిధ కాలాలకు చెందిన శ్రేష్ఞ రచయితల కథలు ఈ సంకలనంలో చోటు సంపాదించుకున్నాయి.
గురజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్యం, చలం మొదలుకొని ఆధునిక రచయితల వరకూ — తెలుగు కథకు వెన్నుదుట్టిన గొప్ప రచనలు ఈ సంకలనంలో ఉన్నాయి. ప్రేమ, వేదన, సమాజ విమర్శన, మానవ సంబంధాలు అన్ని విషయాలను స్పృశించిన కథలు ఇక్కడ ఉన్నాయి.
తెలుగు కథా సాహిత్యాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే, తెలుగు కథకు పరిచయం కావాలంటే ఈ పుస్తకం తప్పక చదవాల్సినదే.