Author:Dr.Nakka Vijayarama Raju
కొందరు డాక్టర్లు మందులతో వైద్యం చేస్తే,మరికొందరు వైద్యులు మాటలతోనే చికిత్స చేస్తారు.డా.నక్క విజయ రామరాజు లాంటి వైద్యులు మాత్రం కథలతోనే సామాజిక రుగ్మతలకు వైద్యం చేస్తారు.గత రెండు దశాబ్దాలకు పైగా అయన మానవత్వాన్ని పరిమళించే కథల ద్వారా సమాజంలోని మంచితనాన్ని పాఠకులకు రుచి చూపిస్తున్నారు.తెలుగు కథకు 'బంగారు మురుగు'తొడిగిన శ్రీరమణ చేతిలో తన కథనేకం ప్రాణం పోసుకున్నాయని చెప్పుకునే ఈ డాక్టర్ తాను,తన కుటుంబం చేసే మంచి పనులలోంచి కొన్ని ,తనకు తారసపడే రోగుల అనుభవాలోంచి మరికొన్నింటితో రుచిగల కథలు వండి,వాటిని 'సుబ్బమ్మ మెస్' ద్వారా పాఠకులకు వడ్డించారు.తొలి కథ 'రూణానుబంధం'మొదలుకొని ఎథిక్స్ ,బయో డైవర్సిటీ ,సిజరింగ్ వంటి ఆణిముత్యాలను కలుపు కుంటూ ,'న్యూ ఇయర్ ఈవ్'వరకు ప్రతి అక్షరాన్ని ప్రేమతో ,అభిమానంతో ,హాస్యంతో వండి పాఠకులకు ఆప్యాయంగా వడ్డించారు.