పుస్తకం :
శ్రీ కొప్పరపు కవుల శతావధాన సౌందర్యం
(ప్రతి పద్య వ్యాఖ్యా సహితము )
వ్యాఖ్యాత :
ఆచార్య తాడేపల్లి పతంజలి
సంపాదకుడు : మాశర్మ
పద్యప్రియులకు,
అవధాన ప్రేమికులకు
గొప్ప కానుక!
తెలుగు భాషకు సంతకం (Signature ) 'అవధానం' తెలుగువాడి సంపద 'పద్యం' అవధాన విద్యా ప్రదర్శనలో అగ్రేసరులు కొప్పరపు కవులు. కొప్పరపు కవులు 100 ఏళ్ళ క్రితం చేసిన అవధానాలలోని పద్యాలు మొట్టమొదటిసారిగా నేడు వ్యాఖ్యా సహితంగా అందుబాటులోకి వచ్చాయి.అందరికీ అర్ధమయ్యే సరళ భాషలో ఈ వ్యాఖ్య సాగుతుంది.ఆ పద్యాలలోని సొగసులు,ఆకర్షణలు,అందాలు,అర్ధాలు,అంతరార్ధాలు,ఛందో విశేషాలు,భావ సౌందర్యాలు,
భాషా మధురిమలు,చమత్కారాలు,చారిత్రక,పౌరాణిక అంశాలు,పద్యశిల్ప రహస్యాలు
ఈ గ్రంథంలో విపులంగా వివరించారు.పద్యాలు రాయాలనుకొనే వారికి,అవధానాలు చెయ్యాలనుకొనే వారికి,పోటీ పరీక్షలకు వెళ్లేవారికి,విద్యార్థులకు,పరిశోధకులకు,తెలుగు పద్యాలను ఆస్వాదించాలనుకొనే వారికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది.
వెయ్యేళ్లకు మించిన తెలుగు సాహిత్య చరిత్రలో,కొప్పరపు సోదర కవులు (కొప్పరపు వేంకటసుబ్బరాయకవి, వేంకటరమణకవి ) స్థానం ప్రత్యేకమైనది.వీరంతటి వేగంగా ఆశువుగా పద్యాలు చెప్పినవారు,అవధానాలు చేసినవారు ఇంకొకరు లేరన్నది అతిశయోక్తి కాదు