Satyapatham | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Satyapatham

B.S.Sharma

ఈ గ్రంధం అసత్యపు మేఘాలను తరిమికొడుతోంది .ఈ దేశం పై జరిగిన దాడులలో కొందరు విధ్వంసాలనుఁ,మరణాలను ఏర్పరిస్తే,ఇంకొందరు అద్భుత వ్యవస్థావిధానాలను,విజ్ఞాన వైభవాలను వికృత కోణంలో దర్శించి,వక్రీకరించి తప్పుదారి పట్టించారు.ఆ వలసవాదుల  కపటవ్యూహానికి తోడు వారి పద్ధతులలో చరిత్రను,సంస్కృతిని అధ్యయనం చేసి ,స్వాభిమానాన్ని పోగుట్టుకున్న భారతీయులు తయారయ్యారు.వారి విధ్యావిధానాలే  సర్వోత్క్రుష్టమనే పారాభిమానంతోమనవైనా సనాతన  'సత్యపథా'ల నుండి తప్పిపోయి అపోహలను,దురభిప్రాయాలను ఏర్పరచి దానినే ఒక పరంపర చేసారు.కొన్ని తరాలు ఈ అహగాహనరాహిత్యపు అంధకారాలలో కూరుకుపోయారు.ఈ పరిస్థితుల్లో...అసలు చరిత్రనీ ,అపోహాలనీ ,పాతుకుపోయిన అసత్యాలని స్పష్టపరుస్తూ ఈ పుస్తకాన్ని రచించడం అభినందనీయం.

A-Z అనే ఆంగ్లాక్షరక్రమ క్రమంలో ఒకొక్క అపోహానీ చీల్చి చెండాడుతూ,అసలు నిజాలను సాక్ష్యాధారాలతో సప్రమాణంగా చెప్పిన తీరు చదువరులకు సత్యసాక్షాత్కారానుభవం కలిగించి తీరుతుంది .మధ్యమధ్యలో కొన్ని ప్రత్యేక కథనాలను సందర్భానుగుణంగా అందించడం మరొక విశిష్టత .వాస్తవానికి దీనిని పాఠ్యంశంగా  చేర్చడం ఆవశ్యకమనిపిస్తుంది.దానికి అవకాశం కష్టసాధ్యం కనుక ఎక్కువ మంది పాటించే విధంగా అందజేయవలసిన భాద్యత దేశాభిమానులకు ,ధర్మానురక్తులకు ఉంది.'భారత ఋషిపీఠం' మాసపత్రికలో ధారావాహికగా ప్రచురించిన ఈ అంశాల సంకలనం 'ఋషిపీఠ ప్రచురణలు 'గానే వెలువరించింది .

'సత్యమేమో' అనిపించేంతగా వ్యాపించి నాటుకుపోయినాఒక అపోహ వాక్యాన్ని ఆంగ్లంలో,తెలుగులో ఉట్టంకించి .వాటి పూర్వాపరాలను విశ్లేషించి ,వాస్తవాలను వెలికితీసి ,వాటి ప్రమాణాలను పేర్కొంటూ ,ఆధారాలను ఆవిష్కరిస్తూ వ్రాసిన పద్ధతి అమోఘం.శతాబ్దాలుగా వ్యూహాత్మకంగా పన్నిన అసత్యారోపణల వలయంలో పడి మనం మరచిన మన ఘనతని సునిశిత పరిశీలనతో ,సూటిగా నాటుకుపోయి శక్తిమంతమైన అక్షర విన్యాసంతో రచయిత దీనిని తీర్చిదిద్దారు .
మన సంస్కృతి ఆదర్శాలను ,ఔనత్యాలను గ్రహించడానికి ఈ పుస్తకం ఒక రాజపథం,'నా ధర్మం ఇంత గొప్పది' అనే గొప్ప సంతృప్తికర ఆత్మగౌరవం ,సద్గర్వం భారతీయుని హృదయంలో దీపింపజేయగలిగే ఈ రచన బహుధా వ్యాప్తి చెందాలని ఆశిస్తున్నాను .

                                                                                                                                           సామవేదం షణ్ముఖశర్మ 

You may also be interested in

Liquid error (templates/product line 147): Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out