Yalamanchili Shivaji,యలమంచిలి శివాజీ
యామంచిలి శివాజీ వ్రాసిన ఈ గ్రంధం గత ఐదు దశాబ్దాలలో వ్యవసాయ రంగంలో ఆశించిన విధానపర అంశాలపై పేర్కొనదగిన వ్యాసాల సంపుటి .వ్యవసాయ అభివృద్ధిలో నెలకొన్న సంక్షోభం వ్యవసాయం ఫై ఆధారపడిన వారిలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది .రైతుల పట్ల అమితమైన ఆవేదనను వ్యక్తపరుస్తూ రచయిత సాగునీరు ,విద్యుత్ ,ఎరువులు,రుణసదుపాయం,పెరుగుతున్న అనుత్పాదక భూమి వంటి అనేక అంశాలను ప్రస్తావించారు .