Pages:195
ఎలా చదువుకున్నాను,ఎలా వుద్యోగం సంపాయించుకున్నాను,ఆ వుద్యోగాన్ని ఎలా చేశాను,కాస్త సర్వీసు వుండగానే చేస్తున్న కొలువు మానేసి మందుల పరిశ్రమ ఎలా పెట్టాను,స్టాక్ మార్కెట్లోకి దిగి నాలుగు రాళ్లు ఎలా వెనకేసుకున్నాను,ఎక్కడో చిత్తూరు జిల్లా మారుమూల ప్రాంతంలో వున్న కొమ్మేపల్లి అలాటి పల్లె నుంచి ఈ మహానగరం హైదరాబాద్ లో ఎలా నిలదొక్కుకోగలిగాను ఈ మొత్తం ప్రయాణాన్ని నాకు తోచిన రీతిలో రాయదగ్గవి రాసుకుంటూ పోతే ...ఈ 'కొండ మెట్లు 'పుస్తకం అయింది.
జీవితం ఎవరికీ Cake Walk కాదు.దైవ దర్శనం కావాలన్న,ఒక స్థాయికి చేరాలన్న కొండా మెట్లు ఎక్కక తప్పదు.
అందుకే న ఆత్మ కథకు 'కొండ మెట్లు' అని పేరు పెట్టుకున్నాను .పుస్తకాలు చదివే ఆసక్తి వున్నవాళ్లు చదువుకోవచ్చు.
పుస్తకం చూడగానే ఆకర్షించే మంచి పేరు!కొండమెట్లు! పేరులోనే ఒక ప్రత్యేకత! పల్లెటూరి బాల్యం నుంచి ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ, ఎదుగుతూ ఒక ఐ.జి గా గమ్యం చేరుకుని సి.ఆర్.నాయుడుగా ప్రసిద్ధుడయిన ఒక ఐ.పి.ఎస్.పోలీసు ఆఫీసర్ -చేరెడ్డిరామచంద్రనాయుడు -చేవ్రాలు ఈ ఆత్మకథ.-కథలాంటి ఆయన 75 ఏళ్ల జీవన యానం ఇది.పోలీసు ఆఫీసర్ ఆత్మకథ అనగానే ఖాకీలు, లాఠీలు, నేరాలు, ఘోరాలు action movies లాంటి కబుర్లే వుంటాయనుకుంటారు ఎవరయినా!అవన్నీ ఇందులో కూడ వున్నాయి.కాని అంతకు మించి ఆసక్తి కరమైన మరి కొన్ని మలుపులు, మెరుపులు ఈ పుస్తకంలో వున్నాయి. వాటిలో ఒకటి సమాజ సేవ అయితే మరొకటి ఆశ్చర్యకరంగా షేర్ మార్కెట్ లో సాధించిన నైపుణ్యాలు, విజయాల వివరణాత్మక కథనాలు. ఒక పెద్ద పోలీసు ఆఫీసర్ లో అరుదుగా కనిపించే విలక్షణ కోణాలు ,విశిష్ట విజయగాథలు ఇవి. వీటినన్నిటినీ నాయుడు గారు తన కొండమెట్లు పుస్తకం లో స్పష్టంగా సోదాహరణంగా తెలియజేశారు .కష్టతరమైన షేర్ మార్కెట్ కిటుకులను కూడ సరళంగా విషయప్రధానంగా వివరించారు.ఇది ఆ రంగంపై ఆసక్తి వున్న వారికి ఉపయుక్తం. నాయుడు గారి సెకండ్ ఇన్నింగ్స్ మరీ ఆసక్తికరం, ఒకింత ఉత్కంఠభరితం కూడ.ఈపుస్తకంలో కనిపించే
ముఖ్య లక్షణం క్లుప్తత.విషయ స్పష్టత.
చదివించే సరళత. ఏకబిగిన చదివించే గుణం ఈ పుస్తకానికి వుంది.చదవడం మొదలుపెడితే ఆ విషయం మీకే తెలుస్తుంది.అన్నట్టు, ఇంకో మాట.కొండమెట్లు పేరులో నాకు ఇంకో ప్రత్యేకత కూడ.కనిపిస్తుంది.అది అంతర్లీనంగా కనిపించే ఆధ్యాత్మికత. రచయిత శ్రీ వారి భక్తుడు. బాల్యం అంతా గడిచింది శ్రీ వారి మెట్టు పరిసరాలలోనే! ఆ ప్రభావం వల్ల కూడ
కావచ్చు ఈ కొండమెట్లు పేరు. పోలీసు జీవితం అంటే అంతా హార్డ్ వేరే అనుకుంటే పొరపాటని చెప్పే ఒక ఖాకీ జీవిత సాఫల్యాల సజీవ కథనం ఈ కొండమెట్లు.