జోగిని వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో నేటికీ అమల్లో ఉంది .కొన్ని శతాబ్దాలుగా ఈ దురాచారం సాంప్రదాయ ముసుగులో నడుస్తుంది.ఆశ్చర్యకర విషయమేమిటంటే ఈ దురాచారానికి మతం కూడా వత్తాసు పలకడం,అంటరానితనంచే సమాజం వెలివేసిన దళిత వెనుకబడ్డ కులాలకు చెందిన ముక్కుపచ్చలారని ముద్దుబిడ్డలను యాగపశువుల్లా గ్రామదేవతకర్పిస్తున్నారు.దేవతలకు బదులు పోతరాజు సూత్రధారణ చేస్తాడు.శవ ఊరేగింపులో నృత్యం చేసిన,పంటపొలాల్లో బిచ్చమెత్తిన పొత్తగావకా పడుపువృత్తికి పాల్పడే జోగిని జీవితం అత్యంత దయనీయమైంది .జోగిని వ్యవస్థ కొన్ని ప్రాంతాల్లో మాతంగి,బసవి,మురళి ఇంకా అనేక పేర్లతో విలువడుతూ ఉంది .సానుభూతితో సంస్కరణాభిలాషతో,లోతైన పరిశోధనతో ఈ గ్రంధం.