ఝాన్సీ లక్ష్మీబాయి జీవించి,పోరాడైనా రోజులు గడిచిపోయి నూటయాభై సంవత్సరాలయింది .ఆమె ఏ ఈస్టిండియా కంపెనీ దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిందో ,ఆ పోరాట ఫలితంగానే ఏడాది తిక్కుండానే ఆ ఈస్టిండియా కంపెనీని తప్పించి స్వయంగా బ్రిటిష్ ప్రభుత్వ పాలన మొదలయింది.ఈ పాలన కూడా ముగిసిపోయి నల్లదొరలకు అధికారమార్పిడి జరిగి ఆరున్నర దశాబ్దాలు గడిచిపోయాయి.ఈ పుస్తకరచన జరిగి యాభై సంవత్సరాలు గడిచిపోయాయి .ఇన్ని మార్పులు జరిగిన కాలం చాలం ముందుకు జరిగిన,ఆ పోరాటానికి ఈ పుస్తకానికి ప్రసంగికత ,ప్రాధాన్యత,అవసరం తగ్గిపోలేదు సరికదా రోజు రోజుకు పెరుగుతున్నాయి.విభిన్న రూపాలలో కొనసాగుతున్న పరాయిపాలన దోపిడీ పీడననాలు ఎదిరిస్తూ వీరోచితంగా,త్యభరితమైన ఆశావహంగా ప్రజాపోరాటాలు ఇవాళ కూడా సాగుతున్నాయి.అందుకే ఇవాళ్టి ఝాన్సీలక్ష్మిబాయి పోరాటం గురించి ఆ పోరాట జ్ఞాపకాల గురించి ఆలోచించవలసిన తలచుకోవాల్సిన విషయాలు మిగిలే వున్నాయి .