Ravi Manthri
ప్రతీ చిరునవ్వు వెనుకా ఒక కథ ఉంటుంది అన్న మాట ఎంత నిజమో, ఆ చిరునవ్వు ప్రేమ నుండి పుట్టింది అయితే ప్రపంచం చాలా అందంగా ఉంటుంది అన్న మాట కూడా అంతే నిజం. 'ప్రపంచానికి చాలా ప్రేమని పంచాలిరా నువ్వు..' అంటాడు నాన్న. నేను మాత్రం ఇష్టంగా ప్రేమకథల్ని పంచుతున్నాను అనిపిస్తుంది అప్పుడపుడు. నచ్చిన వారితో కాసేపు మాట్లాడటం, ఇష్టమైన పనిని చెయ్యటం ప్రియంగా మారిపోయాయి. అందుకే నిన్ను కాసేపు ఆపి కూర్చోపెట్టి ప్రేమగా మాట్లాడాలి అనిపించింది నాకు. యమునా నది ఒడ్డున వెన్నెల, ప్రేమ మకరందపు సిరాలో ముంచిన కుంచెతో గీసిన బృందావనపు రాసలీల దృశ్యాన్ని ఊహించుకుని రాసిన మాటల్ని నీకు వినిపించాలి అనిపించింది. ఆ మాటలకే నేను పెట్టుకున్న పేరు ఈ ధీర సమీరే గంగా తీరే..