జీన్ జీఓనో ఈ కథని 1954 లో వోగ్ సంస్థ కొరకు రాశారు.వారు దీనిని నమ్మకాన్ని నాటి ఆనందాన్ని పండించిన మనిషి అనే పేరిట ప్రచురించారు.ఈ కథ అనతికాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతి పొంది అనేక భాషలోకి అనువదించబడింది .నాటినుంచి నేటి వరకు ,ప్రపంచ వ్యాప్తంగా అడవుల పునరుద్ధరణ కృషికి ఈ కథ గొప్ప ఉత్తేజాన్నిస్తుంది.