ప్రపంచ సాహిత్యంలో మౌఖికంగా పోగొట్టుకున్నవి ఎన్నో లెక్కలేదు.అయినా దొరికినది అంత అద్భుతంగా ఉంటె మూలం ఇంకెంత బాగుండేదో అన్న ఆలోచన ఎవరికైనా రాకపోదు.ఆలా ఎన్నింటినో పోగొట్టుకున్నప్పటికీ ఇప్పటికి రహస్యంగా మిగిలి ఉన్న గీతలే చర్యా పదాలు.అవి సాంధ్య భాషలో ఉన్న బౌద్ధ ఉపదేశాలు,తాత్విక సమస్యల పరిశరాలతో ఉన్న సంగీతమయ గీతాలు.నిఘాఢమైన ఆలోచనల్ని రేకెత్తించే ఆధునిక తత్వశాస్త్రాలు,భారతదేశపు తూర్పు ప్రాంతాల ఆజీవన సరళి ఈ గీతాల్లో ధ్వనిస్తుంది.