Vanguri Chitten Raju,Thanneeru Kalyan Kumar,వంగూరి చిట్టెన్ రాజు , తన్నీరు కళ్యాణ్ కుమార్
అమెరికాలోని తెలుగువారి జీవితాలలో తారసపడే పరిస్థితులను ,సమస్యలను ప్రతిబింబిస్తూ అక్కడి నుండి వెలువడుతున్న అమెరికా తెలుగు కథ సాహిత్యం నూతన తరానికి తెరతీసింది .అమెరికాలో తెలుగు వారి జీవన శైలి కి అద్దంపడుతూ,అక్కడి నుండి వెలువడుతున్న సాహితి ప్రక్రియల్లో కథ ప్రక్రియ అగ్రగామిగా నిలిచింది .అమెరికాలోని తెలుగువారి జీవితాన్ని గూర్చి తెలుసుకోవాలనుకునే వారికి అమెరికా కథ సాహిత్యం ముఖ్య భూమికగా నిలుస్తుంది .అమెరికాలోని తెలుగువారి జీవితాన్ని అమెరికా తెలుగు కథ సాహిత్య పరిశీలన ద్వారా ఈ పరిశోధన సిద్ధాంత వ్యాసం కొత్తకోణం ఆవిషరించింది .