Kompalli HSS Sundar,కొమ్మేపల్లి హెచ్ యస్ యస్ సుందర్
19వ శతాబ్ది భారత సమాజంలో ఒక రకమైన అయోమయ స్థితి నెలకొనింది.ఆర్థిక,సాంఘిక,సాంస్కృతిక,రాజకీయ రంగాల్లో ఆంగ్ల వలసపాలకుల ప్రణాళికలు,దేశి సంస్థానాధిపతుల పరిపాలన కళగలిసి నిరామయాన్ని గందరగోళాన్ని సృష్టించాయి.ప్రజలు తాము కోల్పోయిన అస్థిత్వాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నాలు ప్రారంభించిన శతాబ్దిమిది,వివిధ సమూహాల్లోని అసంతృప్తి,పోరాట పటిమను పెంపొందించి,నూతన నాయకత్వాన్ని తయారుచేసింది ఆనాటి తెలుగు సమాజ అస్తిత్వ పోరుకు నిదర్శనమే 19 వ శతాబ్ది లో సంభవించిన సంఘికోద్యమాలు,రాజకీయ ప్రకంపనలు,విస్తరించే చైతన్యం వివిధ సాంఘిక వర్గాల్లో వేరువేరు రోపాల్లో ఉండేది,దీని విశ్లేషణ క్లిశ్యమైన చారిత్రక పరిశోధన .స్వాతంత్రోద్యమానికి పుష్ఠిపూర్తి నేపథ్యానందించిన శతాబ్దమిది.ఆనాటి సామజిక రాజకీయ చరిత్ర అవగాహనకు ప్రస్తుత గ్రంధం ఉపయుక్తన్గా ఉండగలదు.