దళిత వాదం వ్యాపతిచెందక ముందు కొలకలూరి ఇనాక్ రాసిన కహ్తలు ఇవి.సామాజిక అణచివేతకు ,ఆర్థిక దోపిడీకి గురైన దళితుల జీవితాల సజీవ చిత్రణ ఈ కథలు.ఈ సంకలనంలోని ఊరిబావి,ఆకలి వంటి కథలు ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందాయి.వాటితో పాటు ఈ సంకలనంలో ఉన్న 22 కథలు దళితుల జీవితాలలోని విభిన్న కోణాలను వ్యక్తం చేస్తాయి.ఇనాక్ గారి పదునైన శైలి పాఠకుడిని కథలో లీనం అయ్యేలా చేస్తుంది .ఈ కథలు హుందాగా సాగుతూనే వ్యవస్థలోని లోపాల పట్ల ఆలోచనలను రేకెత్తిస్తాయి